తిమ్మాపూర్, వెలుగు: వీ6 వెలుగు నెట్వర్క్ ఇన్చార్జి, సీనియర్ జర్నలిస్టు చిల్ల మల్లేశం తండ్రి లక్ష్మయ్య అంత్యక్రియలు శనివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో పూర్తయ్యాయి. మల్లేశం, ఆయన కుటుంబీకులను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శనివారం సాయంత్రం పరామర్శించారు. అంతకుముందు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షుడు వెలిచాల రాజేందర్ రావు, నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు.. లక్ష్మయ్య మృతదేహం వద్ద నివాళి అర్పించారు.
8వ డివిజన్ కార్పొరేటర్ సల్ల శారద రవీందర్, పొరండ్ల సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంది లక్ష్మీనారాయణ రెడ్డి, కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ తమ్మనవేని రమేశ్ యాదవ్, సీనియర్ నాయకులు గోపు మల్లారెడ్డి, కాల్వ మల్లేశం, జాప ప్రశాంత్ రెడ్డి, సింగం శ్రీనివాస్, ముంజ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.